Crime News : పెళ్లి చేసుకోవాలన్నందుకు.. చంపి ఏడు ముక్కలు చేసి బావిలోకి
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటయ్య తండాలో విషాదం నెలకొంది. పెళ్లి చూపులు ఓ యువతి ప్రాణం తీశాయి. కాబోయే భర్త వేధింపులతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జరిగింది. ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తంఖ్వా రాష్ట్రంలో ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షాలకు ఇప్పటి వరకు 365 మంది మృతి చెందారు. కేవలం బునేర్ జిల్లాలో దాదాపుగా 225 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కూలిపోయాయి.
మధురవాడ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి చెందారు. పీఎంపాలెం పోలీసుస్టేషన్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడైన సతీష్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు.
ఓ విద్యార్థిని అనారోగ్యంతో చందానగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అయితే ఆ విద్యార్థినిపై అదే ఆస్పత్రిలోని వార్డ్ బాయ్ ప్రైవేట్ పార్ట్‌లను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. చందానగర్ లోని పీఆర్కే హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల ఓ వ్యక్తి అతని 65 ఏళ్ల తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ కిరాతకుడు చేసిన పని గతంలో అతని తల్లి చేసిన దానికి శిక్ష అని చెప్పాడు.
హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి నాటు తుపాకులు, బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా మంగళిగూడెంలో పల్సర్ బైక్ కొనివ్వలేదన్న కోపంతో కన్న కొడుకే తండ్రిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో నాగయ్య తల, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్వాతంత్ర దినోత్సవం రోజునే ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి చేసిన అప్పు తీర్చలేదని ఓ వ్యాపారి అతని కూతుర్ని కిడ్నాప్ చేశాడు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా బాలికను తీసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెండు గంటల్లోనే కేసును ఛేదించారు.