Road Accident: ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు.. స్పాట్‌లోనే 40 మంది?

పోర్చుగల్‌లోని లిస్బన్‌ నగరంలో ఎలక్ట్రిక్ స్ట్రీట్‌కార్ పట్టాలు తప్పి బోల్తా పడటంతో స్పాట్‌లోనే 15 మంది మృతి చెందారు. ఈ స్ట్రీట్ కారులో మొత్తం 40 మంది ఉన్నారు. మిగతా వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
lisbon

lisbon

పోర్చుగల్ రాజధాని లిస్బన్‌(Lisbon) లో ఘోర ప్రమాద(road accident) ఘటన చోటుచేసుకుంది. నగరంలో ఎలక్ట్రిక్ స్ట్రీట్‌కార్(Electrical Street Car) పట్టాలు తప్పి బోల్తా పడటంతో స్పాట్‌లోనే 15 మంది మృతి చెందారు. ఈ స్ట్రీట్ కారులో మొత్తం 40 మంది ఉన్నారు. మిగతా వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే అత్యవసర సేవల బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Jinping Warning: యుద్ధమా, చర్చలా..ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చిన జెన్ పింగ్

అదుపు తప్పడం వల్ల..

ప్రమాదం జరిగిన సమయంలో ఈ స్ట్రీట్‌కార్‌లో దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే కొండ ప్రాంతం నుంచి దిగివస్తున్న స్ట్రీట్‌కార్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంపై లిస్బన్ మేయర్ కార్లోస్ మెడాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌజా కూడా మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

లిస్బన్‌లో ఈ స్ట్రీట్‌కార్ ఫేమస్

లిస్బన్‌లో స్ట్రీట్‌కార్ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ స్ట్రీట్‌కార్లను అక్కడ "ఫ్యూనికులర్" అని పిలుస్తారు. ఇవి రైలు బోగీ మాదిరిగా ఉండి, నగరమంతా తిరుగుతాయి. లిస్బన్‌కు వచ్చే పర్యాటకులు, స్థానికులు ఎక్కువగా వీటిలో ప్రయాణిస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు లిస్బన్‌ను సందర్శిస్తారు. ఈ స్ట్రీట్‌కార్‌లు లిస్బన్ పర్యాటకానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇవి పర్యాటక ప్రాంతమైన లిస్బన్‌లో రోడ్ల మధ్యనే ఉన్న పట్టాలపై నడుస్తాయి. ఈ క్రమంలో అదుపు తప్పి స్పాట్‌లోనే 15 మంది మృతి చెందారు. 

ఇది కూడా చూడండి: Kim Jong: అతి జాగ్రత్తలో కిమ్ జోంగ్..పుతిన్ తో సమావేశం తర్వాత ఆయన డీఎన్ఏను క్లీన్ చేసిన అనుచరులు

Advertisment
తాజా కథనాలు