/rtv/media/media_files/2025/09/03/an-affair-with-a-52-year-old-aunty-2025-09-03-11-57-47.jpg)
An affair with a 52-year-old aunty..26-year-old young man
సోషల్ మీడియా(Social Media) ఎన్ని దారుణాలకు కారణమవుతుందో అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించుకున్నంత వరకు పర్వాలేదు. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే నష్టపోక తప్పదు. సోషల్ మీడియా పరిచయాలు ప్రేమలకు, పెళ్లిళ్లకు చివరికి ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా కారణమవుతున్నాయి. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో చోటు చేసుకుంది. సోషళ్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయం అయిన మహిళతో యువకుడు సాగించిన ప్రేమాయణం చివరికి హత్య వరకు దారితీసింది. వివరాల ప్రకారం..
ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!
Affair With A 52-Year-Old Aunty
ఓ 42 ఏళ్ల మహిళ సోషల్ మీడియాలో ఫిల్టర్లు వాడి తన వయసును దాచిపెట్టి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపింది. చివరకు అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 11న ఫరూఖాబాద్ జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది.ఆ మృతదేహం కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని మెయిన్‌పురికి చెందిన 26 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్‌కు, ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల రాణికి మధ్య ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. రాణి నలుగురు పిల్లల తల్లి. అయిన ఫిల్టర్లు ఉపయోగించి తనను తాను చాలా చిన్న వయసు యువతిగా పరిచయం చేసుకుంది. ఆమె ఫొటోలు చూసి మోసపోయిన అరుణ్ ఆమెతో ప్రేమ(aunty lovers) లో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యక్షంగా కలుసుకుని ఫరూఖాబాద్‌లోని పలు హోటళ్లలో కలుసుకునేవారు. ఈ క్రమంలో రాణి, అరుణ్‌కు సుమారు రూ.1.5 లక్షల వరకు డబ్బులు కూడా ఇచ్చింది.
కొంతకాలంగా రాణి తనను పెళ్లి చేసుకోవాలని, ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అరుణ్‌పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. "ఆగస్టు 10న అరుణ్ ఆమెను మెయిన్‌పురికి పిలిచాడు. పెళ్లి చేసుకోవాలని, తను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలన్న విషయమై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన నిందితుడు, ఆమె చున్నీతోనే గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు" అని నగర పోలీస్ చీఫ్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.మరుసటి రోజు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆమె వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు. రాణి కాల్ రికార్డులు, సోషల్ మీడియా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ క్రమంలో అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరుణ్ తన నేరాన్ని అంగీకరించాడు. పెళ్లి చేసుకోకపోతే పోలీసులకు లేదా తన కుటుంబ సభ్యులకు చెబుతానని రాణి బెదిరించిందన్నాడు. దీంతో నలుగురికి తెలిస్తే తన పరువు పోతుందని ఈ దారుణానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. "వారిద్దరి మధ్య సంభాషణలు, ఫోటోలు ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. నిందితుడిని జైలుకు తరలించాం" అని పోలీసులు వివరించారు.
ఇది కూడా చదవండి: ఇన్‌స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?