MLA Harmeet Singh : పంజాబ్ లో కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్‌ ఎమ్మెల్యే

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హ‌ర్మీత్ సింగ్ ప‌త‌న్‌ మ‌జ్రా పై రేప్ కేసు న‌మోదు అయిన విషయం తెలిసిందే.  నేప‌థ్యంలో ఆయ‌న్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో ఎమ్మెల్యే సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు.

New Update
MLA Harmeet Singh

MLA Harmeet Singh

ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యే హ‌ర్మీత్ సింగ్(MLA Harmeet Singh) ప‌త‌న్‌ మ‌జ్రా పై రేప్ కేసు(rape-case) న‌మోదు అయిన విషయం తెలిసిందే.  నేప‌థ్యంలో ఆయ‌న్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేశారు. హ‌ర్యానా నుంచి ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయనను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో ఎమ్మెల్యే సహాయకులు అడ్డుకున్నారు. పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడినట్లు తెలిసింది.'

ఇది కూడా చదవండి:భారీ భూకంపం.. 500 మందికి పైగా మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటోలు!

AAP MLA Who Fled After Firing At Police

అనంతరం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే రెండు వాహనాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. గందరగోళంలో, పఠాన్‌మజ్రా మరొక అధికారికి వాహనాన్ని ఢీకొట్టి, ఆపై తన సహచరులతో కలిసి స్కార్పియో ఎస్‌యూవీలో పారిపోయాడు. తప్పించుకోవడానికి ఉపయోగించిన ఫార్చ్యూనర్‌ను తరువాత స్వాధీనం చేసుకున్నారు.అయితే, అందులో ఎమ్మెల్యే లేరు. వేరే వాహనంలో పారిపోయారు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.పఠాన్‌మజ్రాను పాటియాలా కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉన్నందున, భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  

ఇది కూడా చూడండి:Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మూడు రోజులు భారీ వర్షాలు

స‌నౌర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే హ‌ర్మీత్ సింగ్ అరెస్టుకు ముందు ఫేస్‌బుక్‌(Facebook) లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఓ పాత ఘ‌ట‌న‌కు సంబంధించి త‌న‌పై రేప్ కేసు న‌మోదు చేసిన‌ట్లు ఆ వీడియోలో ఆయ‌న చెప్పాడు. పంజాబ్ పోలీసులు త‌న‌పై ఐపీసీ 376 కింద కేసు బుక్ చేశార‌న్నారు. త‌న మాజీ భార్య ఆ కేసులో ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ బృందం త‌న‌పై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే ఆరోపించారు. త‌న గొంతు నొక్కే ప్రయ‌త్నం జ‌రుగుతుంద‌న్నారు.

Also Read: ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా.. అయితే ఈ రెండు యాప్స్ మీ మొబైల్‌లో ఉండాల్సిందే!

Advertisment
తాజా కథనాలు