Land Dispute: 11 గుంటల భూమి కోసం ప్రాణం తీశారు

భూవివాదం నేపథ్యంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీయగా, మరికొంతమంది గాయపడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ రక్తపాతాన్ని సృష్టించింది. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

New Update
Land dispute

Land dispute

భూవివాదం నేపథ్యంలో జరిగిన ఒక గొడవ ఒకరి ప్రాణం తీయగా, మరికొంత మంది గాయపడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ రక్తపాతాన్ని సృష్టించింది. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధి దండుమైలారం గ్రామంలో అన్నదమ్ములు గుడేటి నర్సింహ, యాదయ్య, మల్లయ్య, జంగయ్యలకు 18.12 ఎకరాల భూమి ఉంది. ఇది ఒక్కొక్కరికి 4.23 ఎకరాల భూమి రావాలి. కాని నర్సింహ, యాదయ్యలకు ఉండాల్సిన దానికన్నా 11 గుంటల భూమి ఎక్కువగా వచ్చింది. కొంతకాలం క్రితం యాదయ్య మృతిచెందాడు. దీంతో ఈ  వివాదం దాయాదులైన వారి కుమారుల చేరింది. అదనంగా ఉన్న భూమి తమకు చెందాలని మల్లయ్య, జంగయ్యల కుమారులు కొంతకాలంగా కోరుతున్నారు. దీనికి నర్సింహ, యాదయ్యల కుమారులు ఒప్పుకోకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత ఏడాది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.

ఇది కూడా చదవండి:భారీ భూకంపం.. 500 మందికి పైగా మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటోలు!

Land Dispute In Rangareddy District

దీంతో స్పందించిన ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆ  వివాదాస్పద భూమిలోకి ఎవరూ వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. దాన్ని పట్టించుకోని  నర్సింహ, యాదయ్య కుటుంబీకులు ఆదివారం ఆ భూమిలో వరినాట్లు వేస్తుండగా మల్లయ్య కుమారులు బాల్‌రాజ్‌, అతని భార్య పావని, సోదరుడు పర్వతాలు, అతని భార్య మంజుల, జంగయ్య కుమారులు ధన్‌రాజ్‌, వెంకట్‌ అడ్డకున్నారు. దీంతో వారిపై నర్సింహ, యాదయ్య కుటుంబీకులు గొడ్డళ్లు, కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో బాల్‌రాజ్‌(37) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు. తీవ్రంగా గాయపడిన పావని, పర్వతాలు, మంజుల, వెంకట్‌లను ఇబ్రహీంపట్నంలోని లిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మంజుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు ప్రత్యర్థి వర్గానికి చెందిన 9 మందిపై కేసులు నమోదు చేశారు. మృతుడు బాల్‌రాజ్‌ వర్గం ఈ దాడి వెనుక ఓ కాంగ్రెస్‌ నాయకుడు ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మరో వర్గంలో కూడా ఐదుగురికి గాయాలైనట్లు పోలీసులు వివరించారు.

ఇది కూడా చదవండి:సిరిసిల్లలో విషాదం.. బిడ్డ శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని.. ఫ్యాన్ కు ఉరేసుకున్న తల్లి!

Advertisment
తాజా కథనాలు