/rtv/media/media_files/2025/09/03/husbands-affair-with-another-girl-2025-09-03-10-17-32.jpg)
Husband's affair with another girl
భర్త వివాహేతర సంబంధం భార్య ప్రాణం తీసింది. భర్త అక్రమ సంబంధాన్ని(Illegal Affair) ప్రశ్నించినందుకు ఆమెను తీవ్రంగా వేధించాడు.దీంతో విసిగిపోయిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త అక్రమ సంబంధం, వేధింపులతో విసిగిపోయిన గృహిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన బెంగళూరులోని బాగల్గుంటే పోలీస్ స్టేషన్ పరిధిలోని సిదేదహళ్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన నందీష్, పూజాశ్రీకి మూడేళ్ల క్రితం పెళ్లయింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. సంవత్సరం క్రితం వీరికి ఓ పాప జన్మించింది. నందీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పూజాశ్రీ ఓ ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తోంది. కొన్ని నెలల క్రితం పూజాశ్రీకి భర్త గురించి ఒక సంచలన విషయం తెలిసింది.
ఇది కూడా చూడండి:Chandra Grahan 2025: విచిత్రం.. చంద్ర గ్రహణాన్ని ఈ 15 నగరాల్లో స్పష్టంగా చూడొచ్చు..!
Husband's Affair With Another Girl
తన భర్త నందీష్ ఓ ఏడాది నుంచి వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడన్న సంగతి బయటపడింది. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. భర్తను నిలదీసింది. భార్య తనను ప్రశ్నించటం నందీష్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను వేధింపులకు గురి చేయటం మొదలెట్టాడు. మరో వైపు అత్త అదనపు కట్నం(dowry) తెమ్మంటూ ఇబ్బందిపెట్టసాగింది. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక పూజాశ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే భర్త దిగొచ్చాడు. అదనపు కట్నం వద్దని, ఎఫైర్ ఆపేస్తానని నందీష్ ఆమెకు మాటిచ్చాడు. ఇంటికి వచ్చేయమన్నాడు. దీంతో పూజాశ్రీ అత్తింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం నందీష్, పూజాశ్రీకి మధ్య మరొకసారి గొడవైంది. నందీష్ ఆమెను కొట్టాడు.
Also Read : బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!
అయితే, మూడు రోజుల క్రితం, నందీష్ మళ్ళీ గొడవ ప్రారంభించి, అతని భార్య పూజశ్రీపై దాడి చేశాడు. భర్త దారుణాలను పూజాశ్రీ తట్టుకోలేకపోయింది. మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం పుట్టింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు పూజాశ్రీ ఉరికి వేలాడుతుండటాన్ని గుర్తించారు. ఆమె చనిపోవటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. నందీష్‌ను అరెస్ట్ చేశారు. పాపం.. తల్లి మరణం, ఆమె మరణానికి కారణమైన తండ్రి జైలు పాలవ్వటంతో వారి కూతురు అనాథగా మిగిలిపోయింది.
ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!