/rtv/media/media_files/2025/09/02/up-naya-2025-09-02-09-53-09.jpg)
ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని అతని భార్య మరొక మహిళతో ఇన్‌స్టాగ్రామ్ రీల్(Instagram reels) లో చూసింది. చివరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయ్‌లో ఈ ఘటన జరిగింది. జితేంద్ర కుమార్, అలియాస్ బబ్లూ, 2018 నుండి కనిపించకుండా పోయాడు. 2017లో షీలును వివాహం చేసుకున్న అతను ఒక ఏడాదిలోపే విడిపోయారు. షీలును కట్నం, బంగారం కోసం వేధించిన బబ్లూ ఆ డిమాండ్లు నెరవేరకపోవడంతో షీలును ఇంటి నుండి గెంటేశాడు. దీంతో ఆమె కుటుంబం వరకట్న వేధింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో జితేంద్ర ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. అతని తండ్రి 2018 ఏప్రిల్ 20న తన కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
Also Read : ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు
ఏడు సంవత్సరాల తరువాత
పోలీసులు అతని కోసం ఎంత వెతికిన ఫలితం లేకుండా పోయింది. దీంతో బబ్లూ కుటుంబం షీలు, ఆమె బంధువులు అతన్ని చంపి అతని మృతదేహాన్ని అదృశ్యం చేసి ఉంటారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే తన భర్త ఎక్కడో బతికే ఉంటాడని షీలు చాలా సంవత్సరాలు ఆశతో జీవించింది. చివరికి, ఏడు సంవత్సరాల తరువాత తన భర్త మరొక మహిళతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను చూసింది. అతన్ని వెంటనే గుర్తించి ఆమె ఈ విషయాన్ని కొత్వాలి శాండిలా పోలీసులకు వెల్లడించింది. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టగా జితేంద్ర లూధియానాకు తన మకాం మార్చాడని, అక్కడ అతను మరొక స్త్రీని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడని తేల్చారు. పోలీసులు అతన్ని అదుపులోకి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాన్పూర్‌లో దారుణం
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల ఓ వ్యక్తిని అతని స్నేహితులు ప్రలోభపెట్టి హత్య చేసి అతని తల నరికి, అతని మృతదేహాన్ని ఖననం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడి స్నేహితుడు తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే ఈ హత్యకు దారితీసింది. కాన్పూర్‌లోని చకేరి నివాసి అయిన బాధితుడు రిషికేశ్ ఆదివారం నాడు కనిపించకుండా పోయాడని అతని అన్నయ్య రవి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల విచారణలో అతని మృతదేహం మహారాజ్‌పూర్ ప్రాంతంలో కనిపించగా, తల వేరు చేసి నది ఒడ్డున విసిరివేయబడింది. ఈ హత్యకు సంబంధించి నలుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఆగస్టు 29 సాయంత్రం రిషికేశ్‌ను అతని ఇద్దరు స్నేహితులు మోగ్లి, నిఖిల్‌లు గణేష్ చతుర్థి వేడుకలను చూద్దామని తీసుకెళ్లారు. అక్కడకి వెళ్లాక మరికొంతమంది కూడా అక్కడికి చేరుకుని రిషికేశ్ ను బలవంతంగా లాకెళ్లి కాన్పూర్ శివార్లలోని ఏకాంత ప్రాంతం అయిన కాకోరి అడవి వైపు తీసుకెళ్లి అక్కడ చెట్టుకు కట్టేసి తల వేరు చేసి నది ఒడ్డున విసిరేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also Read : Trump: భారత్ ఆలస్యం చేసింది.. టారిఫ్‌లపై ట్రంప్ సంచలన ప్రకటన