Road Accident: కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
మధ్యప్రదేశ్లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
మధ్యప్రదేశ్లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
కాకినాడ జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ఒక యువకుడి నిండు ప్రాణం తీయగా,మరో యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మద్యం ఉందన్న అనుమానంతో ఎక్సైజ్ పోలీసులు బైక్ను వెంబడించగా ఎదురుగా వస్తున్నలారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోగా, మరోకరు గాయపడ్డారు.
ముంబైలో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది.
బీహార్లోని నలందా జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బహదూర్పూర్ గ్రామంలో ఓ మహిళను చిత్రహింసలు పెట్టారు. హత్యచేసి కాళ్లకు మేకులు కొట్టి, చేతిపై సూదితో గుచ్చి, మెడపై బూడిద చల్లారు. ఆపై రోడ్డుపై పడేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ప్రియురాలిని భయపెట్టబోయి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. సరదాగా వేసుకున్న ఉరితాడు బిగుసుకుని క్యాబ్ డ్రైవర్ ఆదర్శ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది
శిరీష హత్య కేసులో ఆడపడుచే హంతకురాలని పోలీసులు తేల్చారు. గుండెపోటని నమ్మించిన ఆమె భర్త వినయ్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. అయితే అనుమానం రావడంతో శిరీష మేనమామ మధుకర్ ఫిర్యాదుతో కథ మొత్తం అడ్డం తిరిగింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఉత్తరాది రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దందాలో విజయవాడకు చెందిన బలగం సరోజిని కీలక నిందితురాలిగా గుర్తించారు. 9 నెలలుగా 26 మంది పసిపిల్లల్ని విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. పాత సర్వదర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు వేల రూపాయలకు అమ్మిన ఇద్దరు కేటుగాళ్లపై ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.