Mother Killed Daughters: ప్రైవేట్ స్కూల్లో చదివించలేదని.. ముగ్గురు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..!

UPలోని బాగ్‌పత్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళ తన ముగ్గురు కూతుళ్లను చంపి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తేజ్ కుమారి తన కుమార్తెలను ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంది. కానీ భర్త ఒప్పుకోలేదు. దీంతో గడవ పడ్డారు. చివరికి గొడవ విషాదంగా మిగిలింది.

New Update
Mother Killed Daughters

Mother Killed Daughters

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh crime) లోని బాగ్‌పత్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లను గొంతుకోసి హతమార్చింది. ఆపై ఆమె కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తన కుమార్తెలను ప్రైవేట్ పాఠశాలలో చదివించాలన్న విషయంలో భార్య భర్తల మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  ఛీఛీ వెధవలు.. 16 ఏళ్ల బాలుడ్ని రేప్ చేసిన మరో మైనర్, యువకుడు.. వీడియో తీసి..!

Mother Killed Daughters

తిక్రి నివాసి వికాస్ కశ్యప్‌కి, పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన తేజ్‌కుమారికి ప్రేమ వివాహం జరిగింది. వికాస్‌ ఢిల్లీలో టూరిస్ట్ బస్సు నడుపుతున్నాడు. అతడికి ఇది రెండవ పెళ్లి. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారు గుంజన్ (7), కీటో (2), మీరా (4 నెలలు). అయితే వికాస్ ఢిల్లీలోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ టూరిస్ట్ బస్సు నడుపుతున్నందున నెలల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదు. దీంతో అతని భార్య తేజ్ కుమారి బాలికలతో కలిసి ఢిల్లీలో అతనితో ఉండాలని కోరుకుంది. అక్కడే పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని కోరుకుంది. ఈ విషయం ఆమె వికాస్ కు చాలాసార్లు చెప్పినప్పుడు, వికాస్ తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఆమెను తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పాడు.

ఇదే విషయంపై భార్య భర్తల మధ్య తరచూ గొడవలు(wife-husband-war) జరిగాయి. రీసెంట్‌గా మరోసారి ఇదే విషయంపై ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. అనంతరం భర్త వికాస్ తన భార్యతో మాట్లాడటం మానేశాడు. దీంతో మరింత కోపంగా ఉన్న భార్య తేజ్ కుమారి సంచలన నిర్ణయం తీసుకుంది. భర్తతో గొడవ తర్వాత ఆ మహిళ ఒక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అప్పుడే మొదట ఆమె తన ముగ్గురు కుమార్తెలను గొంతు కోసి చంపి, ఆపై దుపట్టాతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఆ సమయంలో భర్త వికాస్ ఇంటి బయట చెట్టు కింద పడుకున్నాడు. ఇక ఇంట్లోకి వెళ్లిన భార్య బయటకు రాకపోవడంతో అతడు లోపలికి వెళ్లి తలుపు కొట్టాడు. ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా.. ముగ్గురు పిల్లల మృతదేహాలు మంచం మీద, తేజ్ కుమారి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘తేజ్‌కుమారి తన కుమార్తెలను ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని కోరుకుంది. దీనిపై భార్యాభర్తల మధ్య రోజూ గొడవ జరిగేది. భర్త వికాస్ తన భార్యతో మాట్లాడటం మానేసాడు. దీంతో కోపంగా ఉన్న తేజ్‌కుమారి మొదట ముగ్గురు బాలికలను గొంతు కోసి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకుంది. వికాస్‌కు ఇది రెండవ వివాహం. అతను తేజ్‌కుమారిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

మొదట్లో ఇద్దరి మధ్య అంతా సాధారణంగానే ఉంది. కానీ క్రమంగా పరస్పర వివాదాలు మొదలయ్యాయి. చివరికి ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో.. ఒక తల్లి తన సొంత పిల్లలను గొంతు కోసి చంపి, తన ప్రాణాలను తీసుకుంది.’’ అని తెలిపారు.

Also Read :  రూ.4 లక్షలు ఇస్తేనే బిల్డింగ్ పర్మిషన్.. ACBకి అడ్డంగా దొరికిన మహిళా ఆఫీసర్!

Advertisment
తాజా కథనాలు