TG Crime: తెలంగాణలో దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

ఈ మధ్యకాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యను భర్త చంపడం లేదా భర్తను భార్య చంపడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యులే ఇలా ఒకరినొకరకు చంపుకుంటున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

New Update
Death

Death

ఈ మధ్యకాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యను భర్త చంపడం లేదా భర్తను భార్య చంపడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యులే ఇలా ఒకరినొకరకు చంపుకుంటున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ములుగు జిల్లాలో ఓ వ్యక్తి మేనత్తను గొడ్డలితో నరికి చంపేయడం(Son In Law Kills Aunt) కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో కొండగర్ల విజయ్ కుమార్‌ అనే వ్యక్తి ఉంటున్నాడు. 

Also Read: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దేశవ్యాప్తంగా 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్‌..!

అతడు జల్సాలకు అలవాటు పడి, మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే అదే గ్రామంలో ఉంటున్న అతడి మేనత్త కొండగొర్ల ఎల్లమ్మ(50)ను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆమె ఇచ్చేందుకు నిరాకరించింది. ఆరుబయటకు వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న విజయ్ రోడ్డుపై ఆమెను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో ఉన్న ఎల్లమ్మ మృతదేహాన్ని చూసి గ్రామస్థులు షాకైపోయారు. ఈ ఘటన తర్వాత నిందితుడు విజయ్ నేరుగా పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి లొంగిపోయాడు. అనంతరం సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పులు తిరుమల రావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు.  

Also Read: ఇదెందయ్యా గణపయ్యా...చందా ఇవ్వలేదని.. 4 కుటుంబాలు కుల బహిష్కరణ

లవ్‌ చేస్తోందని కూతురుని చంపిన తండ్రి

ఇదిలాఉండగా ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో మరో దారుణం జరిగింది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక కేసులో సంచలన విషయం విషయం బయటపడింది. మైనర్‌ బాలికను సొంత తండ్రే రాడ్డుతో కొట్టినట్లు తెలిసింది. ఇక వివరాల్లోకి వెళ్తే..  మైలవరం శుద్దిపేట ప్రాంతంలోని చిందే బాజీ అనే వ్యక్తికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు ఐదుగురు ఆడపిల్లలు. రెండో భార్యకు ఒక ఆడపిల్ల. అయితే రెండో భార్య తో వివాహం తర్వాత బాజీ నుండి మొదటి భార్య విడిపోయింది. కానీ ఆమెకు పుట్టిన ఐదుగురు ఆడపిల్లలు బాజీతోనే ఉంటున్నారు. రెండో భార్యకు పుట్టిన కూతురు కూడా వాళ్లతో ఉంటుంది.

అయితే బాజీ రెండో భార్యతో కలిసి గంజాయి అమ్ముతున్నాడు. వాళ్ల దందా బయటపడటంతో పోలీసులు బాజీతో సహా ఆయన భార్యను అరెస్టు చేశారు. ఇటీవలే భార్య జైల్లో ఉన్నప్పటికీ అతడు బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. రెండో భార్య కూతురు గాయత్రి ఒక యువకుడితో ప్రేమలో పడ్డట్లు గుర్తించాడు. దీంతో ఆమెను బెదిరించాడు. ఆమె వినకపోవడంతో తన ఐదుగురు కూతుర్ల ముందే గాయత్రిని ఐరన్‌ రాడ్డుతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎవరికీ తెలియకుండా ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. గత ఐదురోజులుగా గాయత్రి కనిపించకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాజీ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాజీ పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు