/rtv/media/media_files/2025/09/11/woman-brutally-murdered-in-kukatpally-2025-09-11-08-03-33.jpg)
Woman brutally murdered in Kukatpally
కూకట్‌పల్లి స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్(Renu Agarwal) (50) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెను ఇద్దరు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కుక్కర్‌తో తలపై బాది క్రూరంగా హత్య చేశారు. 13వ అంతస్తులో నివసిస్తున్న బాధితురాలి హత్య(hyderabad woman brutal murder) కలకలం సృష్టించింది. వారం క్రితం ఇంట్లో పనికి కుదిరిన జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతినితో పాటు మరో వ్యక్తి అనుమానాస్పదంగా లిఫ్ట్‌లో ప్రయాణించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
హైదరాబాద్ కూకట్‌పల్లి(Kukatpalli Murder Case) లోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్(50) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఫతేనగర్‌లో స్టీలు దుకాణం ఉంది. రాకేశ్ అగర్వాల్, ఆయన కుమారుడు శుభం స్టీల్ దుకాణం నిర్వహిస్తుండగా, కుమార్తె ఇతర రాష్ర్టల్లో చదువుకుంటోంది. రేణు ఇంట్లోనే ఉంటుంది. అయితే అదే కమ్యూనిటీలో నివాసం ఉండే బంధువుల ఇంటిలో ఝార్ఖండ్‌కు చెందిన రోషన్ అనే వ్యక్తి తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా తన గ్రామానికే చెందిన హర్ష్ అనే వ్యక్తిని ఝార్ఖండ్‌కు చెందిన రోషన్ తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాడు. అతడు తన గ్రామానికే చెందిన హర్ష్ అనే వ్యక్తిని రాకేశ్ ఇంటిలో పనిమనిషిగా చేర్చారు. హర్ష్ ఆ ఇంట్లో చేరి కేవలం 11 రోజులు మాత్రమే అయింది.
Also Read : ప్రియుడితో దొరికిన భార్య....అర్థనగ్నంగా ఊరేగించిన భర్త..ట్వి్స్ట్ ఏంటంటే?
Woman Brutal Murder With Cooker
ఎప్పటి లాగే బుధవారం ఉదయం రాకేశ్, శుభం తమ దుకాణానికి వెళ్లగా... ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు అవుతుండగా భర్త, కుమారుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అనుమానంతో 7 గంటల సమయంలో రాకేశ్ ఇంటికొచ్చాడు. ఇంటి తలుపు తట్టినా తీయకపోవడంతో స్థానికంగా ఉండే ప్లంబర్‌ను పిలిపించారు. ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. రాకేష్ ఇంట్లోకి వెళ్లిచూడగా... హాల్లో రేణు అగర్వాల్ కాళ్లు, చేతులు కట్టేసి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దర్యా్ప్తు చేపట్టారు. కాగా, హర్ష్, రోషన్‌లు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
రేణును నిందితులు తాళ్లతో బంధించి... డబ్బులు, నగల కోసం చిత్రహింసలు పెట్టినట్లు ఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఆమె చెప్పకపోవడంతో కూరగాయల కత్తులతో గొంతు కోసి, కుక్కర్‌తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం ఇంట్లోని లాకర్లను పగల గొట్టి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు సూట్‌కేసులో సర్దుకుని వెళ్లినట్లు గుర్తించారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరూ సూట్‌కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. హత్య చేసిన అనంతరం నిందితులు రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి... స్నానం అక్కడే స్నానం చేసి వేరే దుస్తులు ధరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇంటికి తాళం వేసి రాకేశ్ కుటుంబానికే చెందిన స్కూటీపై ఇద్దరూ పరారయ్యారు. కాగా నిందితుల కోసం పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనతో అపార్ట్ మెంట్ నివాసితులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనతో గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సురక్షితం అన్న భావన దెబ్బతింది.
ఇది కూడా చదవండి: ముసలోడు కాదు...మూర్ఖుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం