/rtv/media/media_files/2025/09/11/woman-puts-baby-in-fridge-2025-09-11-10-10-44.jpg)
Woman puts baby in fridge
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్(Woman Puts Baby In Fridge) లో పెట్టి మర్చిపోయింది. శిశువు అమ్మమ్మ ఇది గమనించడంతో ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. మోరాదాబ్‌లోని 23 ఏళ్ల యువతి 15 రోజుల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గత శుక్రవారం రాత్రి తన బిడ్డను ఫ్రిడ్జ్‌లో పెట్టి పడుకుంది. కొద్దిసేపటికి ఆ పిల్లాడు ఏడ్వడంతో అమ్మమ్మ వచ్చింది. ఫ్రిడ్జి డోర్ తీసి బాబును ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు బిడ్డ ఆరోగ్యంగానే ఉందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం
Woman Puts Baby In Fridge
అయితే పిల్లాడిని ఫ్రిడ్జిలో ఎందుకు పెట్టావని తల్లిని అడిగితే.. బాబు పడుకోట్లేదని అందుకే అలా చేశానని సమాధానమిచ్చింది. అయితే ఆమెకు పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అనే మానసిక వ్యాధి ఉందని వైద్యులు తెలిపారు. ప్రవవానంతర మాంద్యం కన్నా పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అనేది తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారికి డిప్రెషన్, గందరగోళం, అనుమానాలు, నిద్రలేమి, తనకు తానే హానీ చేసుకునేందుకు యత్నించడం, సొంత బిడ్డకు కూడా హానీ కలిగించాలనే ఆలోచనలు రావడం లాంటి లక్షణాలు ఉంటాయి.
శరీరంలో హర్మోన్ల మార్పుల వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు వేగంగా తగ్గడం, అలాగే జన్యు ప్రభావం, శారీరకంగా, భావోద్వేగంగా అలసిపోవడం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి వల్ల ఈ మానసిక సమస్యకు గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. అంతేకాదు కుటుంబం నుంచి సపోర్ట్ లేకుంటే కూడా ఈ సమస్యకు గురయ్యే ఛాన్ ఉందని చెబుతున్నారు. అయితే ఇలాంటి మానసిక సమస్యలు కూడా చాలా అరుదుగానే ఉంటాయని డా. మేఘనా గుప్తా తెలిపారు. మహిళలు ప్రసవం తర్వాత భావోద్వేగంగా అస్థిరంగా ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని తెలిపారు. అయితే ఆ మహిళకు చెడు శక్తుల ప్రభావం వల్ల ఇలా చేసి ఉండొచ్చని తన కుటుంబ సభ్యులు భావించారు. పరిష్కారం కోసం ముందుగా సంప్రదాయ పద్ధతులను ఆశ్రయించారు. ఎలాంటి ఫలితం లేకుండా చివరికి వైద్యులను సంప్రదించారు.
यूपी: 15 दिन का बच्चा रो रहा था तो उसे फ्रिज में रखकर गहरी नींद में सो गई मां, डॉक्टर ने बताई इस हरकत की असली वजह
— India TV (@indiatvnews) September 10, 2025
Read more: https://t.co/0tf6hNhY1F#UPNews#Moradabad#Mother#Baby#Fridgepic.twitter.com/xxsBj2kKoo
Also Read: ముసలోడు కాదు...మూర్ఖుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం