/rtv/media/media_files/2025/09/16/ap-husband-beated-wife-2025-09-16-19-14-04.jpg)
AP Husband Beated Wife
భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు దాడి(Wife & Husband Issue) చేయడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. ఆర్థిక సమస్యలు, అక్రమ సంబంధాలు, అత్తమామలతో గొడవల కారణంగానే ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొందరు భర్తలు తమ భార్యలపై అధికారం, ఆధిక్యతను చూపించడానికి దాడి చేస్తుండటం గమనార్హం. మద్యపానం, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నవారు నియంత్రణ కోల్పోయి తరచుగా తమ భార్యలపై హింసకు పాల్పడుతున్నారు.
Also Read : హైదరాబాద్ లో మరో 'దిశ'.. బ్రిడ్జి కింద బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ!
Husband Beated Wife
తాజాగా అలాంటి అమానవీయ ఘటనే మరొకటి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను అతి దారుణంగా కొట్టాడు. రెండు చేతులను చెరో వైపు తాళ్లతో కట్టేసి బెల్టుతో విచక్షణ రహితంగా కొట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం, కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్యను అతి దారుణంగా, విచక్షణా రహితంగా కొట్టాడు. ఇంటి బయట కట్టేసి, బెల్టుతో విచక్షణా రహితంగా చితకబాదాడు. బాధితురాలు ప్రాణాల కోసం ఆర్తిగా కేకలు వేసినా నిందితుడు ఏమాత్రం కనికరం చూపలేదు. అయితే ఎందుకు కొట్టాడు?.. కారణం ఏంటి? అనేది తెలియనప్పటికీ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం...ఇంట్లో భార్యను కట్టేసి తీవ్రంగా హింసించిన భర్త...😢
— Paidiraju (@Paidira71693064) September 16, 2025
సోషల్ మీడియాలో వీడియో వైరల్.@naralokesh sir pic.twitter.com/cxvpgMkDT3
Also Read : ఓరి కామాంధుల్లారా.. 16 ఏళ్ల బాలుడిపై 14 మంది యువకులు రేప్.. తల్లి చూడటంతో..!
బాధితురాలు ఏడుస్తూ, గగ్గోలు పెడుతూ ఉంది. అయినా ఆ వ్యక్తి కొట్టడం ఆపలేదు. వెంటనే పక్కనున్న వేరొక మహిళ వచ్చి అతడిని ఆపే ప్రయత్నం చేసింది. కానీ అతడు ఎక్కడా తగ్గలేదు. జుట్టు పట్టుకుని, కాళ్లతో వీపుపై తన్నుతూ అతి కిరాతకంగా చితకబాదాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ దాడికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలే ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.