CM Revanth: బీసీ జనాభా తగ్గలే.. పెరిగింది.. ఇదిగో ప్రూఫ్.. సభలో రేవంత్ సంచలనం!
తెలంగాణలో బీసీ జనాభా తగ్గలేదని.. పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. 2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా- 51 శాతం అన్నారు. 2024 లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా-56.33 శాతంగా తేలిందన్నారు.