TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..'సీఎం రేవంత్ ఒప్పందాలు

తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. టామ్ కామ్ తో పాటూ టెర్స్, రాజ్ గ్రూప్ లతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. 

New Update
TS

Agreements With Japan Companies

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ బృందంతో కలిసి అక్కడ పలు కంపెనీలతో చర్చలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జపాన్ కు చెందిన రెండు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్ కామ్, జపాన్‌కు చెందిన టెర్న్ గ్రూప్ , రాజ్ గ్రూప్‌ లతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పై మూడు కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. 

దాదాపు 500 మందికి ఉద్యోగాలు..

ఈ అగ్రిమెంట్స్ ప్రకారం రానున్న ఒకటి లేదా రెండు ఏళ్ళల్లో జపాన్ లో అధిక డిమాండ్ లో ఉన్న సాఫ్ట్ వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాల్లో దాదాపు 500 మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో 200, ఇంజనీరింగ్ విభాగంలో ఆటోమోటివ్, మెకానికల్, ఐటీ రంగాల్లో 100, ఆతిథ్య రంగంలో 100, నిర్మాణ రంగం లో 100 ఉద్యోగాలు ఉన్నాయి.

టోక్యో లో ఉన్న  టెర్న్ గ్రూప్, జపాన్‌లో సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్ అండ్ స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్ ప్రపంచ వ్యాప్తంగా హైరింగ్ ఎక్కువగా చేసుకుంటుంది. అలాగే, రాజ్ గ్రూప్, జపాన్‌లోని ప్రముఖ నర్సింగ్ కేర్ సంస్థ సుకూయి కార్పొరేషన్‌తో కలిసి కేర్ టేకర్స్ శిక్షణ.. నియామకాల్లో టామ్ కామ్ తో ఇదివరకే కలిసి పనిచేస్తోంది. ఇప్పుడు తాజా ఒప్పందంతో ఈ సహకారం ఆరోగ్య సంరక్షణేతర రంగాలకు సైతం విస్తరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాలను చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

 today-latest-news-in-telugu | telangana | jobs | japan | it-companies 

Also Read: BIG BREAKING: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు