/rtv/media/media_files/2025/04/21/yUF7xgz7IFyUkWecTDwm.jpg)
mohammed bin salman
హమాస్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అయితే తాజాగా సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చింది. గాజా, లెబనాన్‌పై చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని అల్టిమేటం జారీ చేసింది. రియాద్‌లో జరిగిన అరబ్ అండ్ ముస్లిమ్స్ సమ్మిట్‌లో సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
Also Read: దేశంలో ఐఐటీ విలేజ్.. 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై
గాజాలో మరణహోమం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజా నుంచి వెంటనే తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సౌదీ ఇంత ఘాటుగా స్పందించడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల గాజాలో ఇప్పటిదాకా 43 వేల మందికి పైగా మృతి చెందారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా, లెబనాన్‌పై దాడులు చేస్తూనే ఉంది.
ఇజ్రాయెల్ దాడులకు ఇప్పటికే హమాస్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో హమాస్ మరో ప్లాన్ వేసింది. ఇప్పడు తమ సైన్యంలో చిన్న పిల్లలు, యువతను నియమించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే దాదాపు 30 వేల మంది యువతను 'ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్'లో చేర్చుకొన్నట్లు సౌదీ అరేబియాకి చెందిన అల్ అరేబియా ఛానెల్ తెలిపింది.
Also Read: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా
అయితే వీళ్లలో చాలామంది గతంలో శిక్షణకు హాజరైనవాళ్లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఆ క్యాంపు ఇప్పటికీ ఉందా ? లేదా ? అనే దానిపై స్పష్టత లేదని చెప్పింది. అంతేకాదు కొత్తగా హమాస్‌లో చేరిన వాళ్లకి గెరిల్లా యుద్ధతంత్రం, రాకెట్లను ప్రయోగించడం, బాంబులు అమర్చడం తప్పా ఇంకా ఇతర స్కిల్స్ లేవని తెలిపింది. వీళ్ల నియామకాలు కూడా కచ్చితంగా ఎప్పుడు జరిగాయో అనేదానిపై కూడా క్లారిటీ లేదని పేర్కొంది. అయితే ఈ ఏడాది జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దయిన తర్వాతే వీళ్లు గ్రూప్‌లోకి వచ్చి ఉండొచ్చని తెలిపింది.
telangana | rtv-news | hamas | saudi-arabia | telugu-news