ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు..?

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Accident

Accident

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

భారీ ఎన్‌కౌంటర్..

ఇదిలా ఉండగా ఇటీవల జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

ఈ మేరకు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సోమవారం ఉయదం మవోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.  'లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌లో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి.

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి, ఇందులో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఒక INSAS రైఫిల్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. పోలీసు బలగాలు, నక్సల్స్ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ బీజాపుర్‌ జిల్లా ముర్కరాజుగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు భారీ బంకర్లను గుర్తించాయి.12 స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు