ఖమ్మంలో దారుణం.. ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక.. పాపం రైతు ఏం చేశాడంటే?

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది. వ్యవసాయం కోసం లోన్ తీసుకున్న డబ్బులతో ట్రాక్టర్ కొన్నాడు. గత రెండు నెలల నుంచి ఈఎంఐ కట్టకపోవడంతో బెదిరించారు. దీంతో ఆ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update

ఖమ్మం జిల్లాలో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోనకల్ మండలం గోవిందాపురంలో ఓ రైతు రెండేళ్ల క్రితం L&T ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నాడు. అయితే ఈ డబ్బులతో వ్యవసాయ పనులు కోసం ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి ఈఎంఐ చెల్లించలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఇంటికి వచ్చి గొడవపడ్డారు.

ఇది కూడా చూడండి: Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!

కుటుంబాన్ని బజారుకి లాగుతామని..

కాస్త సమయం కావాలని రైతు కోరినా కూడా కనికరించలేదు. కుటుంబాన్ని బజారులోకి లాగుతామని బెదిరించారు. దీంతో ఆ రైతు పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. దీంతో బోనకల్ పీఎస్‌లో L&T ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు

తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా అన్ని పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్నాడు. గణేష్ అనే 26 ఏళ్ల యువకుడు మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఏ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గణేష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

క్రికెట్ బెట్టింగ్ కారణంగానే గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గణేష్ లోన్ యాప్స్, ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసి బెట్టింగ్ లు పెట్టేవాడని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం కూడా అతడి సూసైడ్‌కు కారణాలని పోలీసులు అంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు