Karthik Reddy : హైడ్రాకు పోటీగా కోబ్రా.. కార్తీక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ సమక్షంలోనే  సీఎం రేవంత్‌పై కార్తీక్‌రెడ్డి విరుచుకుపడ్డారు.  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..కొత్తగా కోబ్రా తీసుకోస్తామని వెల్లడించారు.  కాంగ్రెస్ నాయకులు చేసిన కబ్జా చేసిన భూములను కోబ్రాతో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు కార్తీక్ రెడ్డి.  

New Update

హైడ్రాపై బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో హాట్‌ కామెంట్స్ చేశారాయన.   ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే  సీఎం రేవంత్‌పై కార్తీక్‌రెడ్డి విరుచుకుపడ్డారు.బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..కొత్తగా కోబ్రా తీసుకోస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన కబ్జా చేసిన భూములను కోబ్రాతో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు కార్తీక్ రెడ్డి.  

తెలంగాణకే ఎక్కువ నష్టం

మరోవైపు ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంది.  కానీ ఇప్పటివరకు  500 రోజులైనా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని కేటీఆర్‌ విమర్శించారు.  ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఫైర్ అయ్యారు. త్వరలో జరిగే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు.  

Also read : Oppo A5 Pro 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. కొత్త మొబైల్ అదిరిపోయింది!

Advertisment
తాజా కథనాలు