TS: డీజీపై కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. ఆయనతో పాటూ టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష గుప్తా, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని కూడా రిలీవ్ చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. ఆయనతో పాటూ టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష గుప్తా, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని కూడా రిలీవ్ చేయాలని ఆదేశించింది.
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి మహా కుంభాభిషేకం కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 23న జరగనున్న ఈ కార్యక్రమానికి రావాలని ఆలయ పూజారులు ఆయన్ని కోరారు.
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచింది. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఇంకా కృష్ణా నదీ జలాల వివాదం జరుగుతూనే ఉంది. అసలేంటి ఈ వివాదం ?. దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ రాసలీలలు బయటపడ్డాయి. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న ఓ అమ్మాయితో జానకీరామ్ కలిసి ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఇద్దర్నీ చితకబాదింది.
బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా హోటల్ కు జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ షాకిచ్చారు. గడిచిన రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు.
మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 24 గంటల పాటు షాపులు తెరుచుకోవచ్చని తెలంగాణ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేసే ఉద్యోగులకు రెండింతల వేతనం చెల్లించాలని తెలిపింది.
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. సంగారెడ్డి మండలంలోని ఫసల్ వాదీలో ఈ ఘటన చోటుచేసుకుంది.