Ac Compressor Blast: ఏసీ కంప్రెసర్ పేలడంతోనే అగ్ని ప్రమాదం.. దీనికి గల కారణాలేంటి?

ఏసీకి వైరింగ్ సరిగ్గా చేయకపోవడం, డ్రెయిన్ లైన్లు శుభ్రం చేయకపోవడం వల్ల కంప్రెసర్ పేలుతుందట. ఏసీకి గ్యాప్ ఇవ్వకుండా వాడటం వల్ల ఒక్కసారిగా పేలిపోతాయి. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ, రోజులో కొంత సమయం ఏసీని ఆఫ్ చేస్తే ఈ ప్రమాదం జరగదని అంటున్నారు.

New Update
Reasons why an AC compressor explodes

Reasons why an AC compressor explodes

హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో ఏసీ కంప్రెసర్ పేలి 17 మంది మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వేసవి కావడంతో ప్రస్తుతం చాలా మంది ఏసీ అధికంగా వాడుతుంటారు. అయితే ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా ఎందుకు పేలుతుంది? దీనికి గల కారణాలు ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

వైరింగ్ సరిగ్గా చేయకపోవడం

సరిగ్గా వైరింగ్ చేయకపోవడం వల్ల కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దీనివల్ల మంటలు రావడంతో ఒక్కసారిగా కంప్రెసర్ పేలుతుంది. అలాగే ఓవర్ లోడ్, కెపాసిటర్ వైఫల్యం కూడా కొన్నిసార్లు పేలుతుంది. మంటలు ఏర్పడితే కెపాసిటర్ వేడెక్కి బ్లాస్ట్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

శుభ్రం చేయకపోయినా

కొందరు ఎప్పటికప్పుడూ ఏసీని శుభ్రం చేయరు. దీనివల్ల ఫిల్టర్లు, కాయిల్స్‌లో ధూళి ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ సమయంలో సీని ఆన్ చేస్తే అది వేడికి ఒక్కసారిగా పేలిపోతుంది. ఎప్పటికప్పుడూ వీటిని శుభ్రం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉండవచ్చు.

ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..

డ్రెయిన్ లైన్లు 

డెయిన్ లైన్లు నీరు కొన్నిసార్లు పైకి లేచి పొంగుతుంది. కాస్త నీరు విద్యుత్‌కు తగిలిన షాక్ కొట్టడంతో మంటలు ఏర్పడతాయి. దీంతో ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోతుంది.

ఎక్కువగా వాడటం

కొందరు ఏసీని గ్యాప్ లేకుండా వాడుతుంటారు. కనీసం రెస్ట్ లేకుండా ఏసీని వాడటం వల్ల అది ఒక్కసారిగా వేడెక్కి పేలిపోతుంది. అలాగే వాటికి వెంట్‌లు మూసుకుపోవడం వల్ల కూడా కంప్రెసర్ వేడెక్కుతుంది. ఇలా కూడా పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు