/rtv/media/media_files/FlwvGrizYkiUSWoZfOAF.jpg)
Hyderabad: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని మూడంతస్థుల భవనంలో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. భవనంలో చిక్కుకున్న 50 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. వారిలో 15 ఏళ్ల లోపు వయసు ఉన్న 16 మంది పిల్లలు కూడా ఉన్నారు.
Also Read: Hero Vishal: అనారోగ్యం తర్వాత.. తొలిసారి విజయ్ సేతుపతితో విశాల్.. వైరలవుతున్న ట్వీట్
షార్ట్ సర్క్యూట్
మంటల ధాటికి భయపడిన భవన నివాసితులు టెర్రస్ (పై అంతస్తు) కి పరుగెత్తారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మెట్లు, లాడర్లు ఉపయోగించి వారిని భవనం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 90 నిమిషాల్లో మంటలను పూర్తిగా ఆర్పారు. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.
latest-news | mailardevpally incident | telangana
Also Read: Viral Video: ''కజ్రా రే" పాటకు కూతురితో ఐశ్వర్య- అభిషేక్ ఎలా స్టెప్పులేశారో చూడండి .. వీడియో వైరల్