అడుక్కోవడం ఎందుకు.. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
తిరుమల దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్టలో వైటీడీ ఉందన్నారు సీఎం. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు