Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక టాపర్ గా నిలిచారు. మొత్తం 900 మార్కులకు గానూ ఆమె 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్ కు ప్రిపేర్ అయింది.