Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్..  వివాదంలో హరిహర వీరమల్లు!

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన  తాజా చిత్రం హరిహర వీర మల్లు. ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటున్న ముదిరాజ్ లు నిరసనకు దిగారు.  అంతేకాకుండా సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.  

New Update
hhvm

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన  తాజా చిత్రం హరిహర వీర మల్లు.  నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా క్రిష్, జ్యోతి కృష్ణ  దర్శకత్వం వహించారు.  భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.  

కల్పిత పాత్రను సృష్టించి

ఆయితే ఇప్పుడీ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటూ ముదిరాజ్ లు నిరసనకు దిగారు.  అంతేకాకుండా సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.  పండుగ సాయన్నను పోలిన కల్పిత పాత్రను సృష్టించి సినిమాగా రూపొందించడం అనేది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 

తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు తెచ్చుకున్న సాయన్న..  దొరలు, దేశ్ ముఖ్ ల సంపద కొల్లగొట్టి పేదలకు పంచిన గొప్ప వ్యక్తి సాయన్న అని.. అలాంటి సాయన్న కథను వక్రీకరించారంటున్న ముదిరాజ్ లు ఆందోళనకు దిగారు.  సంబంధం లేని అంశాలను సినిమాలో పొందుపరిచారని ఆరోపిస్తు్న్నారు.  డబ్బుల కోసం తప్పుదారి పట్టించేలా మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రాన్ని బహుజనలందరూ కలిసి అడ్డుకోవాలని హైదరాబాద్ లోని  ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు