/rtv/media/media_files/2025/07/06/yellamma-jathara-2025-07-06-13-17-51.jpg)
Yellamma Jathara
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ప్రతి మంగళవారం జాతర జరుగుతోంది. ఇక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గ్రామ శివారులో రహదారి పక్కనే చెట్టు రూపంలో ఈ ఆలయం ఉంది. ప్రతి మంగళవారం ఇక్కడ సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఈ ఎల్లమ్మకు ఎన్నో మహిమలున్నాయని భక్తులు నమ్ముతున్నారు. ప్రతివారం కేవలం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తున్నారు.
Also read: ముగ్గురు పిల్లలకు తల్లి.. యువకుడితో వివాహేతర సంబంధం.. చివరికి ఊహించని ట్విస్ట్
వెల్లుల్ల గ్రామ శివారులో దాదాపు 300 ఏళ్ల క్రితం ఒక చెట్టు కింద ఎల్లమ్మ తల్లి వెలసిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రతి మంగళవారం జరిగే జాతరకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవారికి బెల్లం, కల్లు సమర్పిస్తున్నారు. కోళ్లు, పొట్టేళ్లు బలిస్తున్నారు. కుటుంబంతో కలిసి వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. దీంతో ప్రతి మంగళవారం అక్కడ సందడిగా ఉంటోంది.
Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
మరోవైపు కొన్ని నెలల క్రితం ఈ ఎల్లమ్మ ఆలయాన్ని ప్రభుత్వం దేవదాయశాఖలో విలీనం చేసింది. దీంతో అక్కడ ప్రతి మంగళవారం జరిగే జాతరకు దేవదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో మంగళవారం మెట్‌పల్లి-- వెల్లుల్ల రహదారిలో రద్దీ ఉంటోంది.