/rtv/media/media_files/2025/07/06/nellore-rottela-panduga-2025-07-06-09-54-21.jpg)
Nellore Rottela Panduga
Rottela Panduga: రొట్టెల పండుగ... ఈ పేరు వినగానే మనసులో ఏదో తెలియని భక్తిభావం, ఆశ మొలకెత్తుతాయి. ప్రతి ఏడాది నెల్లూరులో ఘనంగా జరిగే ఈ పండుగ, కేవలం ఒక వేడుక కాదు, కోరిన కోరికలను తీర్చే ఒక మహిమాన్వితమైన నమ్మకం. ఈ పండుగ వెనుక ఒక గొప్ప చరిత్ర, ఎన్నో తరాల విశ్వాసం దాగి ఉంది.
నేటి నుంచి ప్రారంభం
ఈ ఏడాది నెల్లూరు రొట్టెల పండగ ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా పార్రంభం కానున్నాయి. ఐదురోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ పండుగకు దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. నెల్లూరులోని బారా షహీద్ దర్గా వద్ద ఈ రొట్టెల పండుగను నిర్వహిస్తారు. ఇది కేవలం ముస్లింల పండుగే కాదు, హిందూ, క్రైస్తవ, ఇతర మతాల వారు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొనే పండుగ. ఇక్కడకు వచ్చే భక్తులు, తమ కోరికలు తీరిన తర్వాత, కృతజ్ఞతగా రొట్టెలను పంచుకుంటారు. అలాగే, కోరికలు కోరుకునే వారు ఇతరులు పంచుకునే రొట్టెలను స్వీకరించి, తమ మొక్కును చెల్లించుకుంటారు. ఈ ఏడాది ఈరోజు
రొట్టెల పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టం రొట్టెల మార్పిడి. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు ఒకరికొకరు రొట్టెలను పంచుకుంటారు. ఈ రొట్టెలు కేవలం పిండితో చేసినవి కావు, అవి భక్తుల నమ్మకం, ఆశ, కృతజ్ఞతలకు ప్రతీకలు. ఇందులో రకరకాల రొట్టెలు ఉంటాయి.
- ధన రొట్టె: డబ్బు సమస్యలు తీరాలని కోరుకుంటారు.
- విద్యా రొట్టె: చదువులో రాణించాలని కోరుకుంటారు.
- వివాహ రొట్టె: పెళ్లి సంబంధాలు కుదరాలని కోరుకుంటారు.
- సంతాన రొట్టె: పిల్లలు కలగాలని కోరుకుంటారు.
- ఆరోగ్య రొట్టె: వ్యాధుల నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు.
- ఉద్యోగ రొట్టె: మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు.
ఇలా భక్తులు కోరికకు తగ్గ రొట్టెను స్వీకరించి, భవిష్యత్తులో తమ కోరిక తీరిన తర్వాత అదే రొట్టెను తిరిగి పంచుతామని మొక్కుకుంటారు. ఈ ప్రక్రియలో భక్తుల మధ్య ఒక అద్భుతమైన అనుబంధం, సఖ్యత ఏర్పడతాయి. మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగను జరుపుకోవడం రొట్టెల పండుగ ప్రత్యేకత.
Also Read: The 100 Trailer: 'మొగలిరేకులు' RK సాగర్ ఈజ్ బ్యాక్.. పవర్ స్టార్ చేతులు మీదుగా 'ది 100' ట్రైలర్!