Solar: ఇళ్లపై సోలార్ ప్రాజెక్టు పెట్టుకునే వారికి బంపర్ ఆఫర్.. 20 లక్షలకు పైగా!
ఇళ్లపై సోలార్ పవర్ ప్రాజెక్టులు పెట్టుకోవాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 20 లక్షల ఇళ్లపై 2 కి.వా సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చే రాయితీ రూ.60 వేలకు అదనంగా మరో రూ.50 వేలు అందించనుంది.