Telangana Politics : కేటీఆర్కు కవిత బిగ్ షాక్.. ఢీ అంటే ఢీ

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి.  ముఖ్యంగా బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టి్వ్ చేసిన కవిత నిత్యం ఎదోక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

New Update
ktr

Telangana Politics

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి.  ముఖ్యంగా బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టి్వ్ చేసిన కవిత నిత్యం ఎదోక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఉప్పల్ లో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు జరిగింది. ఉప్పల్‌ నియోజకవర్గం, మల్లాపూర్‌లోని వీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్సీ కవితకు మాత్రం అహ్వానం లేదు. 

తెలంగాణ జాగృతి అధ్వర్యంలో

దీంతో కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం కొంపల్లిలో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో లీడర్ శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేదే జాగృతి లక్ష్యమని చెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసివేస్తే మేధావులు మాట్లాడటం లేదన్నారు కవిత.  అందుకే తెలంగాణ జాగృతి బాధ్యత తీసుకుందని చెప్పారు. 

Also Read:"హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..

తెలంగాణ జాగృతి కార్యకర్తలకు,నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలన్నారు కవిత. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. లీడర్ శిక్షణా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకు ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్ స్టా గ్రామ్ ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏమంటారో చూసుకుంటా .. అసలు భయపడేది లేదన్నారు. మీ వెనుక తాను ఉన్నానని భరోసానిచ్చారు. మహిళ బిల్లు కోసం కొట్లాడిన సంస్థగా మహిళలను నాయకులుగా చేయాల్సిన బాధ్యత తెలంగాణ జాగృతికి ఉందని వెల్లడించారు.  జాగృతి కార్యకర్తలు పదునైన సమాధానం ఇవ్వాలే తప్పా తిట్లు, వల్గర్ భాషకు తావివ్వద్దని.. గాంధీజీ చెప్పిన అహింస మార్గంలో జాగృతి పని చేయాలని పిలుపునిచ్చారు. 

Also Read:కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ

Also Read:'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్

Advertisment
తాజా కథనాలు