/rtv/media/media_files/2025/07/24/mbbs-admissions-2025-07-24-11-27-51.jpg)
Resolve locality quota in MBBS admissions, Supreme Court tells Telangana
తెలంగాణలో నీట్ స్థానికత వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ యూజీ స్థానికత సమస్యకు ప్రభుతమే పరిష్కారం చూపించాలని సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించారు. లేదంటే పిటిషన్ డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. MBBS లో అడ్మిషన్ పొందాలనుకున్న విద్యార్థులు నీట్ పరీక్ష రాయడానికి ముందు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉన్నట్లయితేనే స్థానికులుగా పరిగణిస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. దీన్ని ఖండిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ప్రభుత్వ నిబంధనలు తప్పుబట్టింది.
Also Read: డిజిటల్ అరెస్ట్.. ఇద్దరు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టిన సైబర్ కేటుగాడు
ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేసింది. ఇరుపక్షాల వాదనల తర్వాత సీజేఐ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు రాష్ట్రంలో స్థానికత కింద ప్రవేశాలు కల్పించడం మంచిదే. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ తెచ్చుకునేందుకు ఈరోజుల్లో చాలామంది రాజస్థాన్‌లో కోటాకు వెళ్తుంటారు. కోటాలో ఇంటర్ చదివినంత మాత్రాన తెలంగాణలో ప్రవేశాలు నిరాకరిస్తే ఎలా ? అందుకే తల్లిదండ్రుల కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి.
తెలంగాణలో శాశ్వత నివాసితులైన వాళ్ల పిల్లలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి. దీనికి సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రూల్స్‌ను రూపొందించింది. ఎవరైనా ఉద్యోగి తెలంగాణ శాశ్వత నివాసితులైనప్పటికీ రాష్ట్ర విభజన వల్ల ఏపీకి వెళ్తే అతని పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి. ఇలాంటి ఇబ్బందులే ఏపీకి చెందిన తల్లిదండ్రులకు కూడా ఎదురవుతాయి. అందుకే ఆగస్టు 5 లోపు ఈ నీట్ స్థానికతకు సంబంధించి మీరే ఓ పరిష్కారాన్ని సూచించండి. లేదంటే పిటిషన్‌ను డిస్మీస్ చేస్తామని'' తెలంగాణ ప్రభుత్వానికి సీజేఐ ఆదేశించారు.
Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం
దీనిపై ఇప్పటికే తాము గైడ్‌లైన్స్ తయారుచేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ లాయర్ వినయ్ నావ్రే, శ్రవణ్‌కుమార్ చెప్పారు. ఆగస్టు 5 నాటికి సుప్రీం ధర్మాసనానికి సమర్పిస్తామని చెప్పారు. అయితే విద్యార్థుల తరఫు న్యాయవాది వాదిస్తూ తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారు వరుసగా 9, 10, 11, 12 తరగతులు రాష్ట్రంలోనే చదవి ఉండాలన్న షరతు విధించకూడదని అన్నారు. ఇలా చదవకున్నా నీట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. గతేడాది విద్యార్థులకు ఈ మినహాయింపు ఉందని.. దాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని కోరారు. అలాగే జులై 25 లోపు విద్యా్ర్థులు స్థానికతకు సంబంధించిన సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుందని.. ఈ గడువును పొడిగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.