/rtv/media/media_files/2025/03/19/jWaQbr2YiWT9i7lcPdV5.jpg)
telangana Rains )
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు విఫా తుపాను కారణంగా కొన్ని జిల్లాల్లో బూడిద పొడి వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ మండలంలో రాత్రంతా బూడిద వర్షం కురిసింది. ఇక్కడ సింగరేణి మైన్స్, ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఇలా బూడిద పొడి వర్షం కురవలేదు. ఇప్పుడు ఒక్కసారిగా బూడిద పొడి వర్షం కురవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా ఇవి అగ్నిపర్వతాలు ఉండే దగ్గర జరుగుతాయి. కానీ ఇప్పుడు మణుగూరులో ఇలా జరగడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
ఇది కూడా చూడండి:Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఇది కూడా చూడండి:Hari Hara Veeramallu: హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...
తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి:11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 53 ఏళ్ల నిందితుడు జువైనల్ బోర్డుకు తరలింపు..