BIG BREAKING : వాళ్లకి రూ.5లక్షలు ఇస్తాం.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి  రూ.5లక్షలు ఇస్తామన్నారు. ఇండ్లను పూర్తిచేసుకోవ‌డానికి ప్రభుత్వమే ల‌బ్దిదారుల‌కు ఆర్ధిక స‌హాయం చేస్తుందన్నారు.

New Update
ponguleti

BIG BREAKING : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి  రూ.5లక్షలు ఇస్తామన్నారు. ఇండ్లను పూర్తిచేసుకోవ‌డానికి ప్రభుత్వమే ల‌బ్దిదారుల‌కు ఆర్ధిక స‌హాయం చేస్తుందన్నారు.అర్హత కలిగిన లబ్ధిదారులు ఆగస్టు 15లోపు ఇళ్లు కేటాయించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎప్పుడు దరఖాస్తు చేశారనేది కాకుండా నిజమైన పేదలకు మాత్రమే ప్రాధన్యత ఇవ్వాలన్నారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలన్నారు.  ఇక ఇందిర‌మ్మ ఇళ్ల స‌మ‌స్యలు, ఫిర్యాదుల ప‌రిష్కారానికి టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. వరంగల్ నగర అభివృద్ధిపై సచివాలయంలో మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.  

Also Read:'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా

చారిత్రాత్మక వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్నదే ప్రభుత్వ సంక‌ల్పమన్నారు మంత్రి పొంగులేటి. 2057 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూ. 4170 కోట్లతో  వ‌రంగ‌ల్ నగరంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవ‌స్ధ ఏర్పాటు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వ‌రంగ‌ల్ ప్రాంత ప్రజల చిర‌కాల స్వ‌ప్నం మామునూరు ఎయిర్ పోర్ట్  త్వ‌ర‌లో సాకారం కానుందని మంత్రి తెలిపారు.  యుద్ధ ప్రాతిప‌దికన ఎయిర్ పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ చేపడుతామని,  ఇందు కోసం 205 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం  విడుద‌ల చేసిందన్నారు.  

Also Read:కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ

కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్క్ సంబంధించి ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద 1398 మంది ల‌బ్దిదారుల‌ను గుర్తించి రాజీవ్ గాంధీ టౌన్ షిప్‌లో 863 ప్లాట్‌లు ఇస్తామన్నారు. భ‌ద్రకాళి ఆల‌య మాడవీధుల‌తో పాటు క‌ల్యాణ మండ‌పం, పూజారి నివాసం , విద్యుత్ అలంక‌ర‌ణ‌లను వ‌చ్చే ద‌స‌రా నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.   వరంగ‌ల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవ‌స‌ర‌మైన  భూమి గుర్తింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  

Also Read :   Khammam : ఖమ్మంలో కామాంధుడు :  భర్త సెక్సువల్ టార్చర్ .. భార్య ఆత్మహత్య!

Also Read:"హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..

Advertisment
తాజా కథనాలు