Khammam : ఖమ్మంలో కామాంధుడు :  భర్త సెక్సువల్ టార్చర్ .. భార్య ఆత్మహత్య!

ఖమ్మంలో ఓ భర్త టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. ఆమె సూసైడ్  చేసుకున్నాక ఆమె భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన తరుణ్ 2022లో మౌనికను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

New Update

ఖమ్మంలో ఓ భర్త టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. ఆమె సూసైడ్  చేసుకున్నాక ఆమె భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన తరుణ్ 2022లో మౌనికను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఏడాది వరకు ఎంతో సజావుగా సాగిన వీరి కాపురంలో ఆ తరువాత కలహాలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగిన తరుణ్ లో ఎలాంటి మార్పు రాలేదు. మౌనికను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు.  

భర్తను వదిలేసి కొడుకుతో

మౌనికపై అనుమానం పెంచుకున్న తరుణ్ తరుచూ  వేధింపులకు పాల్పడేవాడు. దీంతో భర్తను వదిలేసి కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లి  తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది మౌనిక. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో 3 నెలల క్రితం మరోసారి పంచాయితీ జరిగింది.  బాగా చూసుకుంటానని చెప్పి మౌనికను తీసుకువెళ్లి వేరే కాపురం పెట్టాడు తరుణ్. అయినప్పటికీ  మౌనికపై అనుమానం తరుణ్ కు ఏమాత్రం తగ్గలేదు.

మళ్లీ ఆమెను శారీరకంగ, మానసికంగా  వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేక భార్య మౌనిక ఎలుకలు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.  భార్య మృతిని తట్టుకోలేక  తరుణ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల మృతితో చిన్నారి అనాథగా మారాడు.  మౌనిక మృతికి తరుణ్ తల్లిదండ్రులు, ఆడపడుచులు కూడా కారణమని ఆరోపిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు