KTR: దమ్ముంటే రా.. నీ సవాల్ స్వీకరిస్తున్నా.. సీఎం రమేష్ కు KTR కౌంటర్!

సీఎం రమేష్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. సీఎం రమేష్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లుగా ఎక్స్ వేదికగా తెలిపారు.  సీఎం రమేష్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే చర్చలకు తాను సిద్ధమని ప్రకటించారు.

New Update
ktr ramesh

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్ ఇటీవల కంచె గచ్చిబౌలి భూముల తనఖా వెనుక సీఎం రమేష్ ఉన్నారని, ఈ విషయంలో సహాయం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం రమేష్‌కు ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్టు ఇప్పించారని ఆరోపించారు. దీనిపై సీఎం రమేష్ స్పందిస్తూ, తెలంగాణలో రిత్విక్ కంపెనీకి రూ. 1660 కోట్ల కాంట్రాక్టు పనులకు సంబంధించి తనపై ఆరోపణలు చేయటం మూర్ఖత్వమని అభిప్రాయపడ్డారు.  కవిత జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీలోని తన ఇంటికి కేటీఆర్ వచ్చారని, కవితను వదిలేస్తే బీజేపీతో పొత్తు, విలీనం చేస్తామని ప్రతిపాదించలేదా అని సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విలీనానికి ఒప్పుకోలేదనే కేటీఆర్‌లో అసహనం కనిపిస్తోందని ఆరోపించారు. 

Also Read:'సలార్ 2' పై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్

Also Read:కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ

సవాల్ ను స్వీకరిస్తున్నా

అయితే సీఎం రమేష్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. సీఎం రమేష్ చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లుగా ఎక్స్ వేదికగా తెలిపారు.  సీఎం రమేష్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే చర్చలకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం రమేష్,  - సీఎం రేవంత్ ఇద్దరూ  కలిసి వస్తే..  HCU రూ. 10000 కోట్ల  స్కాం పైనా.. రూ. 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండిటిపైనా కలిసి చర్చకు తాను  సిద్ధమని కేటీఆర్ ట్వీ్ట్ లో తెలిపారు.  HCU భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న..   పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారని అన్నారు.  నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కోసం పనికి రాని కథలు చెబుతున్నారని అన్నారు.  రూల్స్ ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.  

Also Read:"హరి హర వీరమల్లు" బొ*క్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..

 బీఆర్ఎస్‌ను బీజేపీలోకి విలీనం చేసే అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని, దాని విలీనం అనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ పనికి రాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ ఫ్యూచ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

Advertisment
తాజా కథనాలు