BREAKING: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పెళ్లికి వెళ్లినప్పుడు ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండున్నరేళ్ల కొడుకుతో కలిసి తన ఇంటి మూడో అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన మెట్రో రైలు ఛార్జీలు సవరించింది. ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి తగ్గిన మెట్రో ఛార్జీలు వర్తించనున్నాయి.
'రాజీవ్ యువవికాసం పథకం' అమలులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించే లక్ష్యంతో మొదట 5లక్షల మందికి జూన్ 2న రూ.4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
పెళ్లి అయిన మూడు రోజులకే వరుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. బయ్యారం మండలానికి చెందిన నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది. ఇంట్లో బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలి మృతి చెందాడు.
తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్‌లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్‌నగర్‌లో భారీగా వర్షాలు పడతాయి.
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన టూరిస్టులు పరిగిలో జరిగిన విందుకు బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.