HYD RAIN: హైదరాబాద్‌లో దంచుడే దంచుడు.. ఆ ఏరియాల్లో కుమ్మేస్తున్న వాన!

తెలంగాణలో పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, అరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సాయంత్రం 4గంటల నుంచి మూడు గంటలపాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Hyderabad Rains

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, అరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు మూడు గంటలపాటు హైదరాబాద్‌‌లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

ఇప్పటీకే హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం మొదలైంది. బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో వర్షం కురుస్తోంది. అటు కుత్బుల్లాపూర్, సుచిత్ర లో జోరు వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా, శామీర్ పేట ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో వాహనదారులు  ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైడ్రా సిబ్బంది అప్రమత్తమై.. డ్రైనేజ్ నీటిని ఎప్పటికప్పుడు సాఫీగా కాలవుల్లో పారిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లీయర్ చేస్తున్నారు.

 అరెంజ్ అలర్ట్: 

హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 41 -61 కి.మీ.ల మధ్య వేగంతో ఈదురుగాలు, మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం వుంది.

ఎల్లో అలర్ట్:  

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాలు, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం 
గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం వుంది.

Advertisment
తాజా కథనాలు