Watch Video: వామ్మో వీడెవడండి బాబు.. రైళ్లో పామును చూపించి భిక్షాటన

ఓ వ్యక్తి రైలులో పామును చూపించి భిక్షాటన చేస్తున్నాడు. దీంతో ప్రయాణికులు ఆ పాముకు భయపడి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల సబర్మతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఇలా ఆ వ్యక్తి డబ్బులు వసూలు చేస్తూ కనిపించాడు.

New Update
Man Carrying Snake Asks For Money From Train Passengers

Man Carrying Snake Asks For Money From Train Passengers

ప్రతిదేశంలో కూడా యాచకులు ఉంటారు. ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువగా కనపిస్తారు. రోడ్లు, బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. కొందరు అంగవైకల్యంతో, పసిబిడ్డలకు పాలు లేవని చెబుతూ భిక్షాటన చేసుకుంటారు. మరికొందరైతే అన్ని అవయవాలు బాగున్నా కూడా అడుక్కుంటుంటారు. ఇంకొదరైతే దేవుడి పేరుతో కూడా భిక్షాటన చేస్తుంటారు. తాజాగా గుజరాత్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వినూత్నంగా భిక్షాటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

Also Read: లవర్ ను కలుసుకోవడానికి కుదురడం లేదని బరితెగించిన కూతురు.. తండ్రిని

రైలులో పామును చూపించి భిక్షాటన చేస్తున్నాడు. దీంతో ప్రయాణికులు ఆ పాముకు భయపడి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల సబర్మతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఇలా ఆ వ్యక్తి డబ్బులు వసూలు చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. 

Also Read: యూఎస్ కు భారత్ కీలకం...యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

Also Read: యూఎస్ కు భారత్ కీలకం...యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

ఆ తర్వాత ఈ ఘటనపై అధికారులు కూడా స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తమకు అందించాలని ఆ వీడియో పోస్టు చేసిన వ్యక్తిని కోరారు. అంతేకాదు ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ వ్యక్తి అహ్మదాబాద్‌లోని మంగోలి రైల్వేస్టేషన్ దగ్గర రైలు ఎక్కినట్లు సమాచారం. 

Also Read: ప్రాణం తీసిన అనుమానం.. భార్యను కూతురు ముందే పొడిచి పొడిచి.. ఆ భర్త ఎలా చంపాడంటే..?

Advertisment
తాజా కథనాలు