Local Body Elections: తెలంగాణలో 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు రద్దు !

తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Local Body Elections

Local Body Elections

తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ ఊళ్లను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు ప్రకటించింది. దీంతో ఆ గ్రామాల్లోని గిరిజనేతరులు సుప్రీంకోర్టను ఆశ్రయించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగపేట మండలంలోని 23 గ్రామాలు గిరిజన పరిధిలో లేవంటూ 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అంశంపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. 

Also Read: కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు

నిజాం ఆర్డర్ ఆధారంగానే వాటిని గిరిజన గ్రామాలుగా పరిగణించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించవద్దని పిటిషన్‌లో కోరారు. 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే మంగపేట మండలంలో 23 గ్రామాలు గిరిజన పరిధిలో లేవని.. గిరిజనేతరుల తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ గ్రామాలపై స్టే విధించింది. 

Also Read: హెచ్ 1-బీ వీసా ఫీజుల నుంచి డాక్టర్లకు మినహాయింపు..ఆలోచనలో ట్రంప్ సర్కార్

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే మంగపేట మండల గ్రామాల వ్యవహారంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ క్రమంలోనే ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisment
తాజా కథనాలు