BIG BREAKING: స్మితా సబర్వాల్ సంచలన నిర్ణయం..

స్మీతా సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలంటూ పేర్కొన్నారు.

New Update
Smitha Sabharwal

Smitha Sabharwal

స్మీతా సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. కమిషన్ రిపోర్టులో తన పేరు తొలగించాలంటూ పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు తనకు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలంటూ కోరారు. 

ఇదిలాఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని రేవంత్ సర్కార్‌ దీనిపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేసిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇటీవల అసెంబ్లీలో కూడా కమిషన్ ఇచ్చిన రిపోర్టు గురించి సీఎం ప్రస్తావించారు. అయితే కాళేశ్వరం నిర్మాణాలకు సంబంధించి స్మితా సబర్వాల్‌ రివ్యూ చేసిందని కమిషన్ పేర్కొంది. ఆమె బ్యారేజ్‌లను సందర్శించిన పలు ఫొటోలను కూడా పొందుపర్చింది. 

Also Read: తెలంగాణలో 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు రద్దు !

 సీఎం ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో స్మీతా సబర్వాల్ పలు సందర్భాల్లో మూడు బ్యారేజీలను సందర్శించారని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అడ్మినిస్ట్రేటిన్ పర్మిషన్లు జారీ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపింది. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు తనకు 8b,8c నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల్‌ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రిపోర్టును క్వాష్ చేయాలంటూ కోరారు. 

Also Read: కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు

Advertisment
తాజా కథనాలు