Weather Update: బిగ్ అలర్ట్.. అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం సెప్టెంబర్ 26న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

New Update
HYD RAINS PIC TWO

Heavy rains

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం సెప్టెంబర్ 26న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అయితే ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముుఖ్యంగా తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలి తెలిపింది.  

ఇది కూడా చూడండి: DSP Nalini : నేను చనిపోతున్నాను.. సెలవిక... తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని సంచలన లేఖ

హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో..

హైదరాబాద్‌లో ప్రస్తుతం కొన్ని ఏరియాలో వర్షం కురుస్తోంది. రాత్రంతా వర్షం కురవగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా సికింద్రాబాద్, తార్నాక్, కూకట్‌పల్లి, మాధాపూర్, హైటెక్ సిటీ, యూసఫ్‌గూడ, జూబ్లిహిల్స్, దుర్గం చెరువు, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, పఠాన్‌చెరువులో భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

మరో మూడు రోజుల పాటు వర్షాలు..

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపూర్, కడప, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఉరుములు, మెరుపులు..

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. అలాగే వర్షానికి కరెంటు స్తంభాలు, పాతబడిన గొడల దగ్గర ఉండకూడదని అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్త వల్ల అయినా షాక్ కొట్టే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అయితే తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చూడండి: Batukamma : దేవుడా.. బతుకమ్మ ఆడుతూ... గుండెపోటుతో మహిళ మృతి

Advertisment
తాజా కథనాలు