Batukamma : దేవుడా.. బతుకమ్మ ఆడుతూ... గుండెపోటుతో మహిళ మృతి

బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే కన్నుమూసింది. విషాదకరమైన ఈ ఘటన  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో చోటుచేసుకుంది

New Update
batukamma

బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే కన్నుమూసింది. విషాదకరమైన ఈ ఘటన  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వివాహిత శెట్టి మౌనిక(32) ఉదయం నుండి  ఇద్దరు కూతుర్లు, కొడుకుతో  కలిసి ఎంతో ఆనందంతో తీరొక పూలను తెంపుకొచ్చి ఆ పూలతో బతుకమ్మను పేర్చింది. సాయంకాలం సమయంలో స్థానిక దేవాలయంలో కుటుంబ సభ్యులతో  ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ,  బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆమెను  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. దీంతో పండగ పూట ఆ కుటుంబంలో విషాదఛాయలు 
అలుముకున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Advertisment
తాజా కథనాలు