Mahbubnagar : పిండ ప్రదానం చేసి వెళ్తుండగా.. 5 నెలల గర్భవతితో పాటుగా

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది.  అతివేగంగా డివైడర్‌ను కారు ఢీకొట్టినడంతో కారులో ఉన్న బావ, మరదలు ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు.  మృతులను బీరం రంజిత్ రెడ్డి, హారిక రెడ్డిగా గుర్తించారు.

New Update
accident

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది.  అతివేగంగా డివైడర్‌ను కారు ఢీకొట్టినడంతో కారులో ఉన్న బావ, మరదలు ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు.  మృతులను బీరం రంజిత్ రెడ్డి, హారిక రెడ్డిగా గుర్తించారు. ఆదివారం రోజున పెద్దలకు పిండ ప్రదానం చేసి వెళ్తుండగా..44వ నేషనల్ హైవేపై రాజాపూర్ దగ్గర డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక నుంచి వస్తున్న మరో కారుపై పడింది రంజిత్‌ రెడ్డి కారు. ఈ ప్రమాదంలో రంజిత్‌రెడ్డి కారు నుజ్జునుజ్జయింది. మృతులు వనపర్తి జిల్లా వెల్టూరుకు చెందిన వారిగా గుర్తించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రంజిత్‌రెడ్డి భార్య హారిక రెడ్డి 5 నెలల గర్భవతి వచ్చింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. రంజిత్ రెడ్డి, హారిక రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

 నిండు గర్భిణీ మృతి

ఇక  వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి చెందింది. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆస్పత్రిలోనే  ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తాలూకా రావులపల్లికి చెందిన అఖిల(23) పురిటినొప్పులతో నిన్న అర్ధరాత్రి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అంతా నార్మల్‌గా ఉందని చెప్పి గంట తర్వాత మాట మార్చేశారు డాక్టర్లు.  పరిస్థితి చేజారిపోయింది వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. అంతలోనే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా మృతి చెందింది. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లను సస్పెండ్ చేయాలని బంధువులు ఆసుసత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

Advertisment
తాజా కథనాలు