Telangana: 2 నెలల క్రితమే పెళ్లి.. పాశమైలారం ఘటనలో నవ దంపతుల మృతి
పాశమైలారం ప్రమాద ఘటనలో మరో కీలక విషయం బయటపడింది. రెండు నెలల క్రితమే పెళ్లయిన నవ దంపతులు మృతి చెందడం కలకలం రేపింది. సిగాచి కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య అనే నవదంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.