సర్కార్ బడుల్లో పెరిగిన అడ్మిషన్లు..140 స్కూల్స్ రీ ఓపెన్!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, అధికారులు, టీచర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో గతేడాది కంటే ఈసారి మరో 50 వేల మంది చేరారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, అధికారులు, టీచర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో గతేడాది కంటే ఈసారి మరో 50 వేల మంది చేరారు.
మహా న్యూస్ ఛానెల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని అన్నారు.
హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ దాడులకు పాల్పడ్డారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మరో అడుగు పడింది. వాటి నియామకాలకు నాలుగు వర్సిటీల పాలకమండళ్లు తాజాగా ఆమోదం తెలిపాయి. కాకతీయ వర్సిటీలో 145, శాతవాహనలో 3, ఓయూలో 250, పాలమూరులో 8 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.
ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్క(40) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో ఆమె దాదాపు 18ఏళ్ల పని చేసిన అనుభవం ఉంది.
ఈ నెల 29న కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన తర్వాత బీజీపీ అధ్యక్షుడి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం.. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.