కోర్టుదిక్కార కేసులో.. స్పీకర్‌ని అరెస్ట్ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందా?

కోర్టు ధిక్కార కేసులో స్పీకర్‌ను అరెస్ట్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందాని చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యంపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిన క్రమంలో ఈ ప్రశ్న తలెత్తింది.

New Update
spekar

కోర్టు ధిక్కార కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను అరెస్ట్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యంపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్న ప్రాధాన్యత సంతరించుకుంది.

సుప్రీంకోర్టు అధికారం:
భారత రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టుకు తన ఆదేశాలను ధిక్కరించిన లేదా కోర్టు గౌరవానికి భంగం కలిగించిన ఎవరినైనా శిక్షించే అపారమైన అధికారం ఉంది. ఈ అధికారంలో జరిమానా విధించడం లేదా జైలు శిక్ష విధించడం కూడా ఉంటుంది.

స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ ఉందా?
సాధారణంగా, శాసనసభలో తీసుకునే నిర్ణయాల విషయంలో స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. అయితే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేటప్పుడు, స్పీకర్ ఒక సాధారణ ట్రైబ్యునల్ (న్యాయ మండలి) చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంలో, స్పీకర్ తీసుకునే లేదా తీసుకోని నిర్ణయాలు న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని, ఆయనకు ప్రత్యేక రాజ్యాంగ రక్షణ వర్తించదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే, అది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది.

జైళ్లో 'న్యూ ఇయర్' అంటూ వార్నింగ్:
"న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారో ఆయనే తేల్చుకోవాలి" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం.. స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోకపోతే, కోర్టు ధిక్కార నేరం కింద జైలు శిక్ష (అంటే అరెస్ట్) విధించే అధికారం న్యాయస్థానానికి ఉందని పరోక్షంగా హెచ్చరించడమే.

తీర్పులు: కోర్టు ధిక్కార నేరంలో ఒక రాష్ట్ర మంత్రికి (మహారాష్ట్ర మంత్రి స్వరూప్ సింగ్ నాయక్) గతంలో సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ అధికారాన్ని ఉపయోగించి స్పీకర్‌కు శిక్ష విధించే అవకాశం సైతం సుప్రీంకోర్టుకు ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు