BREAKING: పంచాయతీ ఎన్నికలపై మరో కీలక అప్‌డేట్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది.

New Update
BREAKING

BREAKING

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది. గురువారం డెడికేటెడ్ కమిషన్‌ రేవంత్ ప్రభుత్వానికి కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ రిపోర్టును సమర్పించిన సంగతి తెలిసిందే. అందులో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఉండాలని సూచించింది. ఈ కమిషన్ సిఫార్సులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

Also Read: స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్...ఆ రిజర్వేషన్లలోనూ బీసీలకు అవకాశం

దీనికి సంబంధించి మంత్రుల వద్దకు కూడా ఫైలు పంపించి సంతకాలు తీసుకున్నారు. మొత్తానికి పంచాయతీలు, వార్డుల్లో ఎస్సీ, ఎస్డీ, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి శనివారం పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ జీవోకు అనుగుణంగా వార్డులకు MPDOలు, RDOలు సర్పంచి పదవులకు రిజర్వేష్లను ఖరారు చేయనున్నారు.  

Also Read: తవ్వకాల్లో దొరికిన బంగారం..నాదంటే నాదని ఫైట్‌..చివరికి ఏం జరిగిందంటే?

అంతేకాదు రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు కూడా స్థానాలు కేటాయించనున్నారు. శనివారం, ఆదివారం జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరం పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నామని.. దీనికి సంబంధించిన పిటిషన్‌పై విచారణను ముగించాలని నవంబర్ 24న ప్రభుత్వం, SEC కోర్టుకు తెలపనున్నాయి. మొత్తానికి హైకోర్టు అంగీకరిస్తే నవంబర్ 24 లేదా మరుసటి రోజున ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు