/rtv/media/media_files/2025/11/19/death-2025-11-19-21-10-01.jpg)
Death
హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో దారుణం చోటుచేసుకుంది. కీర్తి అపార్ట్‌మెంట్స్ లిఫ్ట్‌లో ఇరుకొన్ని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అపార్ట్‌మెంట్ 5వ ఫ్లోర్‌లో నరసు నాయుడు తన కుటుంబంతో ఉంటున్నాడు. అతడి చిన్న కొడుకు హర్షవర్ధన్ (5) మధురానగర్‌లోని శ్రీనిధి పాఠశాలలో LKG చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి తల్లి, సోదరుడితో కలిసి హర్షవర్ధన్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే లిఫ్ట్‌లో అయిదో ఫ్లోర్‌కి వెళ్లాడు.
Also Read: అయ్యా దేవుడా.. నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్
తిరిగి కిందకు వచ్చే క్రమంలో 4,5 ఫ్లోర్ మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడున్న సిబ్బంది బాలుడిని గమనించి బయటకు తీశారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హుటాహుటీనా బంజారాహిల్స్‌లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: RTC డ్రైవర్‌ని చితకబాదిన వ్యక్తి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్
Follow Us