Group 1: గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలి: పాడి కౌశిక్ రెడ్డి
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.