Group 1: గ్రూప్‌-1 అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలి: పాడి కౌశిక్ రెడ్డి

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని భారాస ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.

New Update
BRS MLA Padi Kaushik Reddy

BRS MLA Padi Kaushik Reddy

TGPSC నిర్వహించిన గ్రూప్‌1 పరీక్షలో అవకతవకలు జరిగాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపణలు చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేరువేరు హాల్‌టికెట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ''21,093 మంది పరీక్ష రాశారు. 21,103 మందికి ఫలితాలు ఇచ్చారు. పది మంది అదనంగా ఎక్కడి నుంచి వచ్చారు. తెలంగాణ యువతకు దీనిపై సమాధానం చెప్పాలి. 654 మందికి ఓకే మార్కులు వచ్చాయి. ఎలా సాధ్యం.. పేపర్లు ఎలా దిద్దారో తెలియదు.  

 టీజీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి సేకరించే నేను మాట్లాడుతున్నాను. పరీక్ష పేపర్లు 60 రోజుల్లోనే దిద్దారు. కనీసం దీనికి నాలుగైదు నెలలైనా సమయం పడుతుంది. కోఠి కాలేజ్‌లో 18,19వ సెంటర్లో 1494 మంది పరీక్షల రాస్తే వీళ్లలో 74 మంది ఎంపికయ్యారు. పది వేల మంది పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారు. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి 206 ర్యాంక్ వచ్చింది. ఎస్టీ కేటగిరిలో ఆమెకు మొదటి ర్యాంక్ వచ్చింది. ఆమె సెంటర్ నెంబర్ 19లో పరీక్షలు రాసింది. ఆ సెంటర్లలో మహిళలకే అవకాశం ఇచ్చారు. మహిళలకే సెంటర్లు ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేశారు?.

Also Read: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే

Also Read :  భర్త ఉన్న స్త్రీ దేవుడికి తలనీలాలు సమర్పిస్తే.. జరిగేది ఇదే!

Padi Kaushi Reddy Comments On Group 1 Results

ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది పరీక్షలు రాస్తే ఏడుగురు ఎంపికయ్యారు. తెలుగు మీడియంలో 7,800 మంది రాస్తే 70 మంది మాత్రమే ఎంపికయ్యారు. పూజిత రెడ్డి అనే అభ్యర్థి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే మార్కులు తగ్గించారు. తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్‌లో 100 మార్కులు అని ప్రెస్ నోట్ లో ప్రకటించి ఆ తర్వాత 123 మార్కులు వేశారు. ఇదేమని అడిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి మార్కులు తగ్గించారు.  

బీజేపీ నేతలు ఈ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు. కేసీఆర్ హయంలో బీజేపీ నేతలు ఎగిరెగిరి పడ్డారు. అప్పుడు కేసీఆర్ పరీక్ష రద్దు చేశారు. ఇప్పుడు రద్దు చేయాలని బీజేపీ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదు ?. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి. బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహా మంత్రిగా ఉన్నారు. గ్రూప్-1 పరీక్ష అవకతవకల పై ఆయన సీబీఐ విచారణ జరిపించాలి. గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి. దీనిపై న్యాయ విచారణ జరిపించాలి. గ్రూప్-1 పరీక్ష కోసం కోట్లాది రూపాయలు చేతులు మారాయి. భేషజాలకు పోకుండా గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని'' కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Also Read: చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్

Also Read :  రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. వీరందరూ అర్హులే?

 

group-1 | padi-kaushik-reddy | telugu-news | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana-jobs

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు