/rtv/media/media_files/2025/11/13/fotojet-89-2025-11-13-19-41-57.jpg)
Telangana TET Notification Released
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్(tg-tet-notification) విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.ఈ దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు నవంబర్ 29వ తేదీతో ముగియనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read : గుడ్‌న్యూస్.. భారత్‌లో టెస్లా, స్టార్‌లింక్ ఉద్యోగాలు..
TG TET Notification Released
కాగా, 2025 సంవత్సరానికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్(tet-notification-released) ఈ ఏడాది జూన్‌లో జారీ చేశారు. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేయగా.. జులై 22న ఫలితాలు కూడా వెల్లడించారు. తాజాగా రెండో విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేశారు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారంతా తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం ఈ టెట్ పాస్ కావాల్సి ఉంది.
Also Read : 10 + 12 తరగతుల పరీక్షల తేదీలు రిలీజ్.. ఎప్పట్నుంచంటే..?
Follow Us